Minister | న్యూఇయర్ విషెస్

Minister | న్యూఇయర్ విషెస్
- కేంద్ర, రాష్ట్ర మంత్రులకు అధికారుల శుభాకాంక్షలు
Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు(State Minister Atchannaidu)లకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డి, సంయుక్త కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృధ్వీరాజ్, ఆర్డీవోలు, ఇతర అధికారులు గురువారం శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రుల స్వగ్రామం నిమ్మాడ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీల నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, ప్రజలు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోను శాసనసభ్యులు ఇళ్ళవద్ద శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారితో ఆయా ప్రాంతాలు కోలాహలంగా మారాయి.
