బీసీలకు మద్దతు ప్రకటింకిన మంత్రి అడ్లూరి
గొల్లపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్(42 percent reservation for BCs) ఇవ్వాల్సిందే అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ(SCs, STs), మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న బంద్‌కు ఆయన మద్దతు ప్రకటించారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి(Gollapally)లోని నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీ వర్గాల హక్కుల కోసం కట్టుబడి పనిచేస్తుందని, 42% రిజర్వేషన్ సాధన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

