Minister | ప్రతిక్షణం మీకోసం పనిచేస్తా..
ప్రచారంలో దూసుకు వెళ్తున్న సంగెం దంపతులు
Minister | మంథని: మంథని మండలం ఖానాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా సంగెం అరుణ గట్టయ్య బరిలో ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీవీ రిమోట్ కు ఓటేయాలని, ప్రతి క్షణం తమ సొంత ఇంటి ఆడబిడ్డల అండగా ఉంటానని పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె ప్రచారంలో దూసుకెళుతున్నారు.
దాదాపుగా ఆమె గెలుపు ఖాయమైనట్లుగా ప్రజలంతా విశ్వసిస్తున్నారు. గతంలో సంగెం దంపతులు నిరుపేద ప్రజలకు సేవలు అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని, ప్రతిక్షణం ఊరికి అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఊరిలో ఏ సమస్య వచ్చినా సొంత ఇంటి ఆడబిడ్డలా, సైనికురాలిగా ముందుంటానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. గ్రామస్తులు ఆమె తరుపున ప్రచారం చేయడం విశేషం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె గెలుపు దాదాపు ఖరారైననట్లు సంగెం దంపతుల అభిమానులు భావిస్తున్నారు.

