Minister | వాకిటి శ్రీహరిని కలిసిన జిల్లా కలెక్టర్

Minister | మక్తల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పశు సంవర్ధ‌క‌, డైరీ, మత్స్య, యువజన క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని పూల మొక్కను అందజేసి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Minister

గత నెలలో సెలవుపై వెళ్లిన జిల్లా కలెక్టర్ తిరిగి విధుల్లో చేరిన అనంతరం మంత్రిని కలుసుకున్నారు. అనంతరం జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మంత్రి వాకిటి శ్రీహరి శాలువాతో సన్మానించారు.

Leave a Reply