mid-day meal | మెగా పేటీయం..

mid-day meal | మెగా పేటీయం..

mid-day meal | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వచ్చేనెల డిసెంబర్ 5న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు(Government schools), కళాశాలల్లో మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పేటీయం)ను నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.

ఈ సమావేశానికి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై పిల్లల విద్యా ప్రగతి పై ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా చర్చించాలని ఆమె సూచించారు. గురువారం, కలెక్టర్ ఛాంబర్ నుంచి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో మెగా పేటీయం(Mega Paytium) ఏర్పాట్ల పై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ సమావేశం అనంతరం హెచ్‌పీసీను విద్యార్థులకు అందజేస్తారన్నారు. తద్వారా పిల్లల స్థితిని తల్లిదండ్రులు స్పష్టంగా తెలుసుకునే అవకాశముంటుందని వివరించారు. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి తల్లిదండ్రులకు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం(mid-day meal scheme) ద్వారా భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

విద్యార్థుల హాజరు, పరీక్ష ఫలితాలు, దినచర్య పురోగతి తదితర వివరాలను సమయానుకూలంగా తెలుసుకోవడానికి ప్రభుత్వం అందించిన లీప్ యాప్ ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు.

ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. (ఫంక్షనల్ లీటరసీ & నూమె్రేసీ) పరిధిలో విద్యార్థులు చదువుతున్న తరగతికి తగ్గ పఠన–లేఖన నైపుణ్యాలు ఉన్నాయా లేవా అన్న విషయం పై కూడా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చిస్తారన్నారు. 10వ తరగతి విద్యార్థుల సిలబస్ డిసెంబర్ 5 నాటికి పూర్తికాబోతోందన్నారు. అక్కడి నుంచి 100 రోజుల కార్యాచరణ(100 Days Activity) ప్రణాళిక ద్వారా వారికి పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్లు స్పష్టం చేశారు.

పాఠశాలలకు ప్రభుత్వం అందించిన మౌలిక వసతులు, క్రీడా సామగ్రి, లెర్నింగ్ కిట్లు, అలాగే విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను కూడా పేటీయం సందర్భంగా తల్లిదండ్రులకు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమాన్ని సమీక్షించనున్నారని, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ పరిధిలోని పాఠశాలల్లో హాజరుకానున్నారని తెలిపారు. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ ఈ మెగా పేటీయంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.

Leave a Reply