MI vs SRH | స‌న్ రైజ‌ర్స్ తో పోరులో టాస్ నెగ్గిన ముంబై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈరోజు (గురువారం) ముంబై హోం గ్రౌండ్ లో ముంబైని ఢీ కొట్టేందుకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రెడీ అయ్యింది.

వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై గ‌డ్డ‌పై ఆరెంజ్ ఆర్మీ తొలుత బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది.

తుది జ‌ట్లు :

సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, ఈషాన్ మలింగ, జీషన్ అన్సారీ.

ముంబై ఇండియన్స్ : విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ.

గెలుపు జోష్ లో ముంబై – హైద‌రాబాద్

ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు జట్లు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే, నెట్ రన్ రేట్ వ్యత్యాసంతో ముంబై 7వ (0.104) – హైద‌రాబ‌ద్ (-1.245) 9వ స్థానంలో ఉంది.

ఇక‌పోతే స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు గ‌త మ్యాచ్ లో పంజాబ్ పై విజ‌యం సాధించి వ‌రుస ప‌రాజయాల‌కు బ్రేక్ వేసింది. ఇప్పుడు వాంఖడేలో ముంబైని ఓడించి అదే జోరును కొనసాగించాలని ఆరెంజ్ ఆర్మీ చూస్తోంది.

ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ‌లు ఫామ్‌లోకి రావడం స‌న్‌రైజ‌ర్స్ అతిపెద్ద సానుకూలాంశం. వీరిద్ద‌రితో పాటు ఇషాన్ కిష‌న్‌, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలు ఆట‌గాళ్లు రాణిస్తే ముంబై కి క‌ష్టాలు త‌ప్ప‌వు.

మరోవైపు, ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. సన్‌రైజర్స్‌ను ఓడించి విన్ స్ట్రీక్ ను కొనసాగించాలని ముంబై కోరుకుంటుంది.

హెడ్‌-టు-హెడ్‌..

ఐపీఎల్ లో ఇప్ప‌టివ‌ర‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ – ముంబై ఇండియన్స్ జట్లు 23 సార్లు తలపడ్డాయి. వీటిలో 12 మ్యాచ్‌ల్లో ముంబై గెలవ‌గా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

పిచ్ రిపోర్ట్‌..

వాంఖ‌డే మైదానంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇరు జ‌ట్ల‌లోనూ బిగ్ హిట్ట‌ర్లు ఉండ‌డంతో భారీ స్కోర్లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *