Megastar | రఫ్పాడిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Megastar | రఫ్పాడిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’
Megastar | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి దూసుకుపోతోంది. మొదటి రోజు రూ. 84 కోట్ల రూపాయల భారీ వసూళ్లతో చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది ఈ సినిమా. మూడో రోజు మకర సంక్రాంతి సెలవు దినాన్ని అద్భుతంగా వాడుకుని 150 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది.

దీంతో ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ కామియో, నయనతార స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


