మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ మహిళల జట్టు తమ జోరు కనబరుస్తొంది. ఈరోజు యూపీ వారియర్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 166/7 పరుగులు చేసింది. కిరణ్ నవ్‌గిరే (51) హాఫ్ సెంచరీతో రాణించింది. శ్వేతా సెహ్రావత్ (37), చినెల్లె హెన్రీ (33) పరుగులు చేశారు. ఇక మిగిలిన వారు స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు.
దీంతో 167 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. అద్బుతంగా రాణించింది. మెగ్ లానింగ్ (69), అన్నాబెల్ సదర్లాండ్ (41 నాటౌట్) అదరగొట్టారు. మారిజానే కాప్ (29 నాటౌట్) ధనాధన్ షాట్లతో ఆకట్టుకుంది. దీంతో ఆడిన మూడు మ్యాచుల్లో రెండు మ్యాచులు గెలిచి.. పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకంది ఢిల్లీ జట్టు.
ఇక ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైన యూపీవారియర్స్… పాయింట్స్ టేబుల్లో ఆఖరిస్థానంలో ఉంది.