Meets | ఆదిలాబాద్ కలెక్టర్ ను కలిసిన మాజీ ఎంపీ

Meets | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : మాజీ పార్లమెంట్ సభ్యుడు, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థులకు ఉపయోగపడేల నోట్ బుక్ లు, పెన్నులు కలెక్టర్ కు అందజేశారు. అనంతరం ఆదివాసీ గిరిజన సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీరి వెంట ఇచ్చోడ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జలై జాకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కేపెల్లి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply