ఘనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు….

ఘనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు….

బిక్కనూరు, ఆంధ్రప్రభ : బిక్కనూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు అతిమాముల రమేష్, డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ డాక్టర్ విట్టల్ రెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధిరాములు, అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ సత్యం, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు సాజీద్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply