Medaram | ఇది సరైనది కాదు…
Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ : అధికార పార్టీకి కొంతమంది తుడుందెబ్బ నాయకులు కొమ్ముకాస్తున్నారని ఆదివాసీ నాయకులు(Tribal leaders) మేడారం మాజీ సర్పంచ్ చిడం బాబు రావు(Chidam Babu Rao) అన్నారు. తాడ్వాయి మండలం ఆదివాసి సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు గడ్డం అరుణ ఆధ్వర్యంలో సమావేశమైన మేడారం, ఊరట్టం, కాల్వపల్లి ,నార్లాపూర్, బయ్యక్కపేట, వెంగళపూర్ గ్రామాల మాజీ సర్పంచులు సమావేశమయ్యారు.
తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోడెం బాబు, ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ధబ్బగట్ల సుమన్, ములుగు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి బడే నాగజ్యోతి మీద చేసిన అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. జాతి మనుగడ కోసం, గిరిజన చట్టాలు అమలు చేయడం కోసం పనిచేస్తున్నామని చెప్పి మేడారం గుడి ప్రాంగణ(Medaram temple premises) ఆలయ నిర్మాణ విషయంపై ములుగు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పై తప్పుడు ప్రకటన చేయడం సరైనది కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు మేడారం మాజీ సర్పంచ్ చిడం బాబురావు, వెంగళపూర్ మాజీ సర్పంచ్ గడ్డం అరుణ కన్నెపల్లి మాజీ సర్పంచ్ గొంది శ్రీధర్ఆ, దివాసి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

