Medaram | ఆదివాసీ సంఘాలపై ఆరోపణలు సరికాదు

Medaram | ఆదివాసీ సంఘాలపై ఆరోపణలు సరికాదు
Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ : ఆదివాసీ సంస్కృతి సంప్రదాయ మూలలు 3వ గొట్టు నుంచి 7వ గొట్టు వరకు వెయ్యి ఏళ్ల చరిత్ర చెడిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో మేడారం జాతరను నిర్వహిస్తుంటే కొందరు పనిగట్టుకుని విమర్శలు చేయడం సరికాదని తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల జేఏసీ ఛైర్మన్ దబ్బకట్ల సుమన్(JAC Chairman Dabbakatla Suman) అన్నారు. అలాగే ఆదివాసీ సంఘాలపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
ఈ రోజు తాడ్వాయి మండల కమిటీ అధ్యక్షుడు మోకాళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమ్మక్క-సారాలమ్మ(Sammakka-Saralamma) మేడారం జాతర సందర్భంగా తలనీలాలు, కొబ్బరి, బెల్లం, లిక్కర్, కోళ్లు, తైబజార్ కాంట్రాక్టు కేవలం ఆదివాసీ సంఘాలకు ఇవ్వాలని కోరారు. మేడారం జాతరకు ట్రస్ట్ బోర్డ్ కమిటీ వెంటనే ఆదివాసీలతో మాత్రమే వేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముద్దబోయిన రవి(Muddaboyina Ravi), ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్నిబెల్లి గణేష్, తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు పాయం కోటేశ్వరరావు, ములుగు జిల్లా మహిళ జాక్ చైర్మన్ చేలా శమంతకమణి, మాల్కం. రాధిక, తుడుందెబ్బ ములుగు నియోజకవర్గ అధ్యక్షులు కొప్పుల జగన్నదరవు, అలుగుబెల్లి పూర్ణ, బంగారి శ్రీధర్, దబ్బకట్ల దయాకర్ మొదలగువారు పాల్గొన్నారు.
