6వ వార్డులో ఎండీ ఖాజా న‌వాజుద్దీన్ జ‌య‌కేత‌నం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిల‌ర్‌గా ఎండీ ఖాజా న‌వాజుద్దీన్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. శుక్ర‌వారం జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్య‌ర్థి 358 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్య‌ర్థిపై గెలుపొందారు. వార్డు అభివృద్ధికి అన్నివిధాలుగా పాటుడుతాన‌ని న‌వాజ్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా వార్డు ఓట‌ర్ల‌కు పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని మ‌హ్మ‌ద్ ఖాజా న‌వాజుద్దీన్ చెప్పారు.

Leave a Reply