అయ్యప్ప మాలతో సకల ఐశ్వర్యాలు..

అయ్యప్ప మాలతో సకల ఐశ్వర్యాలు..

బిక్కనూర్, (ఆంధ్రప్రభ)
అయ్యప్ప స్వామి మాల ధరిస్తే.. సకల ఐశ్వర్యాలు కలుగుతాయని బిక్కనూర్ హరిహరపుత్ర అయ్యప్ప ఆలయ గురు స్వామి వెంకట సుబ్బారావు అన్నారు. బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అయ్యప్ప ఆలయంలో పలువురు భక్తులు అయ్యప్ప మాల ధరించారు. ఈ సందర్భంగా మాల ధరించిన స్వాములు అయ్యప్ప ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గురు స్వామి మాట్లాడుతూ.. 41 రోజులు కఠోర దీక్షతో పూజలు నిర్వహిస్తే.. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అనుకున్న కోరికలు నెరవేరుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. అయ్యప్ప అనుగ్రహం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి శివం, గురు స్వాములు రాజేందర్, బాల్రెడ్డి, పోతిరెడ్డి, మోహన్ రెడ్డి పలువురు స్వాములు పాల్గొన్నారు.

Leave a Reply