May Day Wishes | గ్రామాల అభివృద్ధిలో మీ పాత్ర ప్ర‌శంస‌నీయం – శ్రామికుల‌కు ప‌వ‌న్ విషెస్

వెల‌గ‌పూడి – ప్రపంచ కార్మిక, కర్షక, శ్రామిక సోదర, సోదరీమణలందరికీ “మే డే” శుభాకాంక్షలు తెలిపారు ఎపి డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ . ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు. శ్రామికుల స్వేదం – దేశ ప్రగతికి ఇంధనం, దేశాభివృద్ధిలో మీ పాత్ర వెలకట్టలేనిదని ప్ర‌శంసించారు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ శ్రామికులకు . అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం సందర్భంగా వారి సేవలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రామికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలియజేశారు.

Leave a Reply