Mass Raja | రవితేజకి ఆ ఇద్దరు బ్లాక్ బస్టర్స్ అందించేనా..?

Mass Raja | రవితేజకి ఆ ఇద్దరు బ్లాక్ బస్టర్స్ అందించేనా..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా వరుస ప్లాపులతో కెరీర్లో వెనబడ్డాడు. సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చాడు. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమా బాగానే ఉంది కానీ.. బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయింది. కాకపోతే ఈమధ్య కాలంలో రవితేజ నుంచి వచ్చిన సినిమాల్లో బెస్ట్ అనే టాక్ వచ్చింది. దీంతో ఈసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని ఇద్దరి దర్శకుల పై నమ్మకం పెట్టుకున్నాడట మాస్ రాజా. ఇంతకీ.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు..?

రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణతో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. శివ నిర్వాణ ఇంత వరకు ప్రేమథా చిత్రాలు.. ఫ్యామిలీ చిత్రాలు తెరకెక్కించాడు. అయితే.. ఈసారి రూటు మార్చి కొత్త తరహా జోనర్ ట్రై చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ కథ ఎలా ఉంటుందంటే.. ఫాదర్ సెంటిమెంట్, పాప ఎమోషన్స్ తో ఉంటుందట. అంతే కాకుండా ఇందులో బలమైన యాక్షన్ రివెంజ్ డ్రామా కూడా ఉంటుందట. దీనికి ఇరుముడి అనే టైటిల్ పిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. తన జోనర్ మార్చి శివ నిర్వాణ కొత్తగా ట్రై చేస్తుండడంతో మాస్ రాజా రవితేజను ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది.

ఇక రవితేజ చేస్తున్న మరో సినిమా వివేక్ ఆత్రేయతో. నేచురల్ స్టార్ నానితో సరిపోదా శనివారం సినిమా తీసిన తర్వాత వివేక్ ఆత్రేయకు చాలా గ్యాప్ వచ్చింది. కోలీవుడ్ స్టార్ తో సినిమా చేయాలని ట్రై చేశాడు కానీ.. తిరిగి మళ్లీ టాలీవుడ్ హీరోతోనే సినిమా చేస్తున్నాడు. అదే.. మాస్ రాజాతో సినిమా. వివేక్ ఆత్రేయ రెగ్యులర్ కథలకు భిన్నంగా కథ చెప్పాలి అనుకుంటాడు.

తన టేకింగ్ అండ్ మేకింగ్ రెండింటిలోనూ వైవిధ్యం ఉంటుంది. రవితేజ కోసం ఓ కొత్త తరహా కథ రెడీ చేశాడట. ఇది మాస్ రాజాకు బాగా నచ్చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ.. ఈ ఇద్దరి దర్శకులతో చేసే సినిమాల పై రవితేజ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఈ సినిమాలైనా రవితేజకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందిస్తాయో లేదో చూడాలి.

CLICK HERE TO READ ప్లానింగ్ మారిందా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply