LSG vs MI | మార్ష్ అదిరే ఆరంభం.. 10 ఓవ‌ర్లకు ల‌క్నో స్కోర్ !!

లక్నో : హోం గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు దుమ్ము రేపుతోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఎల్ఎస్‌జి.. ధనాధన్ బ్యాటింగ్ తో దంచికొడుతోంది. లక్నో బ్యాటర్లు చాకచక్యంగా బౌండరీలకు బాదుతూ.. ముంబై బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు.

ఓపెనర్ మిచెల్ మార్ష్ ల‌క్నోకు అదిరే ఆరంభం ఇచ్చాడు. ప‌వ‌ర్ ప్లేలో ఫోర్లు, సిక్సుల‌తో (31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) అర్ధ సెంచరీతో చెల‌రేగాడు. ఐడెన్ మార్క్రామ్‌తో కలిసి 42 బంతుల్లో తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. అయితే, 6.6వ ఓవ‌ర్లో యంగ్ స్టార్ విఘ్నేష్ వేసిన బంతికి ఔట‌య్యాడు.

ఆ తరువాత వ‌న్ డౌన్ లో వచ్చిన నికోలస్ పూరన్ (6 బంతుల్లో 12) ప‌రుగులు చేసి 8.5వ ఓవ‌ర్లో పాండ్యా బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఏడోవర్ల వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా కోల్పోని లక్నో జట్టు… స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

అయిన‌ప్ప‌టికీ, లక్నో సూపర్ జెయింట్స్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. కాగా, ప్ర‌స్తుతం క్రీజులో మార్క్రమ్ (19 బంతుల్లో 23)తోపాటు రిష‌బ్ పంత్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *