చోరీ కేసులో ఇరువురు నిందితులు అరెస్ట్ …

చోరీ కేసులో ఇరువురు నిందితులు అరెస్ట్ …
దొంగలించబడిన సొత్తు రికవరీ
20 తులాల బంగారు ఆభరణాలు,
10 తులాల వెండి ఆభరణాలు రికవరి
కర్నూలు డి.ఎస్.పి బాబు ప్రసాద్…
కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలో జరిగిన చోరీ కేసులో ఇరువురిని అరెస్టు చేసి. 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు పది తులాల వెండి రికవరీ చేసినట్లు. కర్నూల్ డి.ఎస్.పి బాబు ప్రసాద్ తెలిపారు. బుధవారం చోరీకి సంబంధించిన. వివరాలను ప్రత్యేకంగా. తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. కర్నూల్ నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లోని అమీన్ అబ్బాస్ నగర్ కు చెందిన వెంకట సుబ్బయ్య పేపర్ మిల్ లో పని చేస్తూ రిటైర్ అయ్యారు. ఒక కార్యం నిమిత్తం 2026 మార్చి 27న కడపకి వెళ్ళాడు.
2026 మార్చి 29 అర్ధ రాత్రి సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటి తాళాలు పగులకొట్టి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించారు. ఇంటిలోని బీరువా తాళాలు పగులగొట్టి అందులోని సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలు దొంగలించుకోపోయారన్న ఫిర్యాదు పై కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పీ శ్రీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహ, కర్నూలు త్రీ టౌన్ శేషయ్య, ఎస్సై చంద్ర శేఖర్ రెడ్డి, క్రైమ్ పార్టీ పోలీసులు మురళీధర్, సుబ్బారాయుడు, వాసు, సుంకన్న, చెంచన్న, శేఖర్ లు ప్రత్యేక బృందాలుగా ఏర్ప డ్డారు. దర్యాప్తులో భాగంగా అందుబాటులో ఉన్న CC TV ఫుటేజ్ లను పరిశీలించారు.

దొంగతనానికి పాల్పడిన నిందితులు బాలాజీ నగర్ లో నివాసముండే ఇద్దరు మైనర్ లుగా గుర్తించారు. బుధవారంఉదయం మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద వారిని అరెస్ట్ చేాశారు. వారి నుండి దొంగతనం చేయబడిన మొత్తం సొత్తును రికవరీ చేసి వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పెట్టడమైనది. వీరు గతం లో కర్నూల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో గణేష్ నగర్ నందు RTC DM వారి ఇంట్లో కూడా దొంగతనానికి పాల్పడ్డారు.
ప్రజలకు ముఖ్య గమనిక :
ఎండాకాలం అని ఇంటికి తాళాలు వేసి ఆరుబయట /ఇంటి మీద పడుకొనే వారు, బయటి ప్రాంతాలకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మన అజాగ్రత్త దొంగలకు ఆదాయం వనరు అని, అప్రమత్తంగా ఉండాలని కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
