సూర్యాపేట : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ (Penpahad) మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న మారం పవిత్ర (Maram Pavitra) ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యారంగంలో తన కృషి, బోధనలో కొత్త పద్ధతుల అమలు, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో ఆమె చూపిన అంకితభావం ఫలితంగా ఈ గుర్తింపు దక్కింది.
ఆమె సాధనను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం (Teacher’s Day) సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం (award) తో సత్కరించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పవిత్రను అభినందించారు.