Maoist Deviji Alive : దేవ్ జీ.. ఆజాద్ సజీవులే
- పోలీసులు చంపేస్తారు
- కోర్టుకు హాజరు పర్చాలి
- హైకోర్టులో మానవ హక్కుల సంఘాలు పిటీషన్
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి )
విజయవాడలో పోలీసులు జరిపిన ఆపరేషన్ సంభవ్ లో.. మావోయిస్టు అగ్రనేత.. తిప్పరి తిరుపతి (Tppari Tirupati) (దేవ్ జీ), ముల్లా రాజిరెడ్డి (Raji Reddy) (ఆజాద్) ను కోర్టులో హాజరు పర్చాలని పౌరహత్యుల సంఘాలు ఏపీ హైకోర్టులో హెబియప్ కార్పస్ (Habias Carpus) పిటీషన్ దాఖలు చేసింది.
మారేడమిల్లి అడవిలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా ( Madvi Hidma) , ఆయన సతీమణి రాజే (Raje) సహా ఐదుగురు మృతి చెందిన కొన్ని గంటల వ్యవధిలోనే ఏపీ పోలీసులు, ఆక్టోప్ గ్రేహౌండ్ (Octopus) దళాలు.. విజయవాడ, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మావోయిస్టు పార్టీ షెల్టర్లపై మెరుపు దాడులు నిర్వహించారు. విజయవాడలో 28 మంది, ఏలూరులో 15 మంది, కాకినాడ, కోనసీమ 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది.
బుధవారం ఉదయం విజయవాడలో విలేఖరుల సమావేశం నిర్వహించిన పోలీసులు 50 మందిని అరెస్టు చూపించారు. అంతలోనే మారేడుమిల్లి అడవుల్లో ( Maredumilli Forest) మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారనే సమాయారంతో.. మావోయిస్టు అగ్రనేతలు తిప్పరి తిరుపతి, రాజిరెడ్డి మృతి చెందారనే సమాచారం వైరల్ అయింది. కానీ ఈ ఎన్ కౌంటర్ లో టెక్ శంకర్ (Tech Shankar) మృతి చెందినట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎప్నీ ద్రువీకరించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 64 మందిలో దేవ్ జీ, ఆజాద్ (Maoist Deviji Alive) కూడా ఉన్నారని పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పోలీసులు మాత్రం దేవ్ జీ తమకు దొరకలేదని చెబుతున్నారు. ఈ స్థితిలో.. పోలీసులు అదుపులోకి తీసుకున్న 64 మందిలో 14 మంది కీలక నేతలుగా పోలీసులు గుర్తించారని, వీరిలో ఏడుగురిని ఎన్ కౌంటర్ చేశారని, మిగిలిన ఏడుగుర్నీ ఎన్ కౌంటర్ చేయటానికి ప్లాన్ లు సిద్ధం చేసుకున్నారని పౌరహక్కుల సంఘాలు అనుమానిస్తున్నాయి. దీనికి తోడు డీజీపీ హరీష్ కుమార్ గుప్త ( AP DGP ) గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్తున్నారని .. అంటే దేవ్ జీ, ఆజాద్ పోలీసుల అదుపులోనే ఉన్నారని మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక దేవ్ జీ, ఆజాద్ తమ వద్ద లేరని పోలీసులు హైకోర్టుకు వివరించగా.. కచ్చిత ఆధారాలను సమర్పించాల మానవ హక్కుల సంఘాలను హైకోర్టు ( High Court Ordered) ఆదేశించింది.

