Seetakka | అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Seetakka |ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 లక్షల నిధులతో ఈ రోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది.
సైన్స్ ల్యాబ్ & కంప్యూటర్ ల్యాబ్(Science Lab & Computer Lab) నిర్మాణం, కోటి యాభై లక్షల నిధుల రూపాయలతో ముస్లిం కమ్యూనిటీ హాల్(Community Hall) నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Mantri Sitakka), జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి శంకుస్థాపన చేశారు.

