హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…

హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…

జన్నారం, ఆంధ్రప్రభ : హనుమాన్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పైడిపల్లి హనుమాన్ దేవాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని పొనకల్ వాసి, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు జక్కు సత్తయ్య గుప్తా, కుమారులు జక్కు రమేష్, భూమేష్, శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో పండితులు గుండి సత్యనారాయణ శర్మ, గణేష్ శర్మ లు అభిషేకం, అర్చన, హోమం కార్యక్రమాలు నిర్వహించి, అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి, తీర్థ,అన్న ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్, గ్రామ సర్పంచి జక్కు సుష్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాక్,పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పలు హనుమాన్ దేవాలయాల్లో భక్తులు హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు.

Leave a Reply