Makthal | అవకాశం ఇవ్వండి..

Makthal | అవకాశం ఇవ్వండి..
- గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
- మంథన్ గోడ్ సర్పంచ్ అభ్యర్థి రాజేందర్ గౌడ్
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదరించి అవకాశం కల్పించండి.. మంథన్ గోడ్ గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా రాజేందర్ గౌడ్ కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తానన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్‌లో ఈ రోజు తన మద్దతు దారులతో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి సేవకుడిగా పని చేస్తానన్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. స్థానిక సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. .ప్రజల మద్దతుతోనే అభివృద్ధి సాధిస్తామన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మద్దతుదారులతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డ నెంబర్ బుగ్గప్ప, రంజిత్, నరేష్, ఆంజనేయులు, బుగ్గప్ప, షఫీ, నవనీత, వెంకటమ్మ, రాధ, అర్చన, చెన్నకేశవులు, రంజిత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
