మక్తల్ | మహబూబ్ నగర్ జిల్లా, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపునకు వెళ్తున్న TG 38 6669 నెంబర్ గల ఇన్నోవా కారును… పక్కన నుండి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసం కాగా, ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Maktal | ఎమ్మెల్యే కు తృటిలో తప్పిన ప్రమాదం
