త‌ల ప‌ట్టుకుంటున్నరైతులు

త‌ల ప‌ట్టుకుంటున్నరైతులు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్(Bhimgal) మండలం బడా భీమ్‌గల్ గ్రామంలో రెండు రోజుల నుండి కురుస్తున్నభారీ వర్షాలకు మొక్క‌జొన్న పంట త‌డిసిపోయింది. దీంతో మొక్క జొన్న(millet) రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

మొక్క జొన్న కంకులు కోసి అరబోసేందుకు రోడ్ల పై(on roads) వేశారు. వర్షం కురవడం తో కంకులు పూర్తిగా తడిసి మొలకలు(sprouts) వస్తున్నాయి. చేతికి వచ్చిన మొక్క జొన్నపంట ఎలా అమ్ముకోవాల‌ని రైతులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. పంట త‌డ‌వ‌డం వ‌ల్ల తాను తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని రైతులు ల‌బోదిబోమంటున్నారు.

Leave a Reply