Machilipatnam | రేపు క‌లెక్ట‌రేట్‌లో పరిష్కార వేదిక

Machilipatnam | రేపు క‌లెక్ట‌రేట్‌లో పరిష్కార వేదిక

  • జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 19వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి మీకోసం.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక- కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో అందజేయవచ్చన్నారు.

మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక కాల్ సెంటర్ నంబర్ 1100 కు ప్రజలు ఎవరైనా సరే కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతోపాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్ సైట్ లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా కలెక్టర్ కోరారు.

Leave a Reply