Los Angeles | గుండెల్లో కార్చిచ్చు..

Los Angeles | గుండెల్లో కార్చిచ్చు..
ఆంధ్రప్రభ : జనవరి 2025లో లాస్‌ఏంజెలెస్‌లో సంభవించిన కార్చిచ్చులు ఇటీవలి దశాబ్దాలలో అతిపెద్ద ప్రకృతి విపత్తు. ఈ మంటలు వేలాది హెక్టార్లలో అడవుల్ని బుగ్గిచేశాయి. సమీపంలోని పట్టణాలను స్మశానాలుగా మార్చేశాయి. అంతేకాదు, వేలాది మంది గుండెల్ని, ఊపిరితిత్తుల్ని విషపూరిత పొగతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యాయి.

ఈ అసాధారణ పరిస్థితులు హెల్త్ ఎమర్జీకి దారితీశాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చిచెప్పింది. సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, మంటలు చెలరేగిన ప్రదేశంలో గుండెపోటు, శ్వాసకోశ సమస్యలతో పాటు సాధారణ అనారోగ్యాలు ఉప్పెనలా చుట్టుముట్టాయి.
Los Angeles రెట్టింపు సంఖ్యలో అసాధారణ ఫలితాలు
అగ్ని ప్రమాదం జరిగిన 90 రోజుల వరకు ఇలాంటి కేసులు గణనీయంగా పెరిగాయి. గుండెపోటు కేసులు 46శాతం, శ్వాసకోశ సమస్యలు 24శాతం, సాధారణ వ్యాధులు 218శాతం ఎక్కువగా నమోదయ్యాయి. అనారోగ్యానికి సంబంధించిన రక్త పరీక్షల్లో దాదాపు రెట్టింపు సంఖ్యలో అసాధారణ ఫలితాలు వచ్చినట్లు సెడార్స్-సినాయ్‌లోని పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ డైరెక్టర్, అధ్యయన సీనియర్ రచయిత సుసాన్ చెంగ్ పేర్కొన్నారు.
ఈటన్, పసిఫిక్ పాలిసాడ్స్ మంటలు ప్రజల ఆరోగ్యంపై తక్షణ, తీవ్ర ప్రభావాన్ని చూపాయని ఈ పరిశోధన స్పష్టంచేసింది. లాస్ ఏంజెలెస్ అడవుల్లో చెలరేగిన దావానలం అత్యంత వేగంగా వేలాది ఎకరాలను దహించివేసింది. సమీపంలోని హాలీవుడ్ ప్రముఖుల నివాస ప్రాంతాలను దగ్ధంచేసింది.
America Travel Ban | మరో 5 కంట్రీలకు నో ఎంట్రీ
నగరాల్లోకి వ్యాపించిన మంటల వల్ల కార్లు, ప్లాస్టిక్‌లు, ఎలక్ట్రానిక్స్ వంటి మానవ నిర్మిత పదార్థాలు భారీ మొత్తంలో కాలిపోయి విషపూరిత వాయువులు విడుదలయ్యాయి. దీనివల్ల మునుపెన్నడూ కనీవినీఎరగని రీతిలో ప్రాణాంతక, సాధారణ వ్యాధులు ప్రబలినట్లు డిసెంబర్ 17న విడుదలైన ఈ నివేదిక స్పష్టంచేసింది. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ఈ అధ్యయన ఫలితం ప్రచురితమైంది.

ఈ మంటల వల్ల కలిగిన అనారోగ్య ప్రభావాలను పరిశోధకులు రాబోయే పదేళ్లపాటు అధ్యయనం చేయనున్నారు.
జనవరి 7 నుండి ఏప్రిల్ 7 వరకు ఈ పరిశోధన బృందం ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ వార్డుల రికార్డుల్ని అధ్యయనం చేసింది. మంటలు ప్రారంభమైన తర్వాత మొదటి 90 రోజుల మెడికల్ పరిస్థితిని పరిశీలించారు.
ఈ గణాంకాలను 2018-2024 మధ్య ఆరోగ్య పరిస్థితులతో పోల్చిచూశారు. సాధారణ అనారోగ్యం, గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలలో పదునైన పెరుగుదలను గుర్తించారు. కార్చిచ్చుల మూలంగా విడుదలయ్యే సూక్ష్మ కణాలు శరీరంలోకి ప్రవేశించి, గుండె, ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపాయని తెలిపారు.
Los Angeles అగ్ని ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడానికి
దావానలం సమయంలో మానసిక ఆందోళన, ఒత్తిడి కూడా ఆకస్మిక ఆరోగ్య సమస్యలకు దోహదం చేసినట్లు అని కార్డియాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్, అధ్యయనం మొదటి రచయిత జోసెఫ్ ఎబింగర్ పేర్కొన్నారు.
ఈటన్-పాలిసాడ్స్ మంటలు లాస్‌ఏంజెలెస్ ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన అడుగు. భవిష్యత్తులో ఇలాంటి ముప్పు తీవ్రతను తగ్గించడానికి, అగ్ని ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడానికి చేపట్టాల్సిన ముందస్తు చర్యల్ని నిర్ణయించడానికి ఈ పరిశోధనలు ఉపయోగకరమని చెప్పారు.

click here to read మరో 5 కంట్రీలకు నో ఎంట్రీ
Los Angeles Los Angeles
