ఒంగోలులో ప్రత్యక్షం
- ఆటోవాలా సేవకు హాజరు
ఒంగోలు రూరల్ ఆంధ్రప్రభ : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన(Damacharla Janardhana) ఆటో డ్రైవరుగా మారారు. ఒంగోలులో ఆటో డ్రైవర్ల సేవ పథకంలో శనివారం ఒంగోలు(Ongole) నగరంలోని మినీ స్టేడియంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ వాహనాలతో సహా ఆటో డ్రైవర్లు స్థానిక బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లారు. జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanaraya Reddy), ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీని ప్రారంభించారు. అక్కడకు వచ్చిన వీరికి ఆటో డ్రైవర్లు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం తమకు కల్పిస్తున్న ఆర్థిక ప్రయోజనంపై సంతోషం వ్యక్తం చేశారు. దీనితో ప్రజా ప్రతినిధులు అందరూ ఖాకీ చొక్కాలు వేసుకొని ఆటో ఎక్కారు. ఇంతలో ఒక్కసారిగా దామచర్ల జనార్ధన్ డ్రైవర్ సీట్(Driver Seat)లో కూర్చున్నారు. నేరుగా ఆయనే ఆటో నడుపుకుంటూ మినీ స్టేడియం వరకు ర్యాలీకి నేతృత్వం వహించారు. ఎమ్మెల్యే నడుపుతున్న ఆటోలో మంత్రి, ఎంపీ, మేయర్ కూర్చుని ఈ ర్యాలీకి మరింత శోభ తెచ్చారు.
బస్టాండు సెంటర్ నుంచి ట్రంకు రోడ్డు మీదగా కలెక్టరేట్, నెల్లూరు బస్టాండ్ సెంటర్(Bus Stand Center) మీదగా కొనసాగిన ఈ ర్యాలీలో సుమారు 500 ఆటోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ .ఆర్. గోపాలకృష్ణ, టీటీసీ సుశీల, ఒంగోలు ఆర్డిఓ కళావతి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

