గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
బి.ఎం.బి. ఏ2.0 – 100 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నరసరావుపేట, ఆంధ్రప్రభ : ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా టి.బి.ఎం.బి. ఏ2.0 – 100 రోజుల కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్, టీ.బీ నియంత్రణ అధికారి డాక్టర్ యు మాధవిలత పాల్గొని జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం, టీవీ ముక్తాభారత్ అభియాన్ ను ప్రారం భించారు.
దీనికి సంబంధించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కో – ఆర్డినేటర్ రాజా రమేష్, జిల్లా హెడ్ క్వార్టర్ సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్ వైజర్ , ఎస్ వెంకటేశ్వరరావు, షేక్ జాన్ బీ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
