Leopard attack | చిరుత దాడి..

Leopard attack | చిరుత దాడి..
- లేగ దూడలు మృతి
- భయాందోళనలో గ్రామస్తులు
Leopard attack | ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో గత రెండు రోజులుగా చిరుత పులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంది.. ఇప్పటికే అటవీశాఖ అధికారులు బేగంపేట, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో పర్యటించి చిరుత పులి పాద ముద్రలను గుర్తించారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుర్కపల్లి మండలంలో ఇబ్రాహీంపూర్ గ్రామ శివారులో గల మాటూరి కృష్ణ పొలం దగ్గర పులి ఒక్క దూడనీ, ఒక ఓ చిన్న లాగానే దాడి చేయగా మృత్యువాత పడ్డాయి. వెంటనే అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనిస్తున్నారు. చుట్టుముట్టు గ్రామాలైన దత్తాయపల్లి, వెంకటాపూర్ వీరారెడ్డిపల్లి తుర్కపల్లి గ్రామ రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
