20 రోజులుగా వదిలేశారు
- రాకపోకల ఊసే లేదు
- ఉన్నది పోయే
- కొత్తది రాదాయే
పుట్టపర్తి ( శ్రీసత్యసాయి జిల్లా) ఆంధ్రప్రభ : ఉన్న రోడ్డును కాస్త తవ్వేశారు. కొత్త రోడ్డును వదిలేశారు. ఇక వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలు(Government offices) అదేవిధంగా తమ గ్రామాలకు వెళ్లే ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఇదీ శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai Distt) అధికారుల పనితీరు. విషయమేంటంటే.. పుట్టపర్తి ఎనుములపల్లి ప్రధాన రహదారిలో ఆర్ అండ్ బి అధికారులు రోడ్డును బాగు చేస్తామనే పేరుతో దాదాపు నాలుగు అడుగుల మేర రోడ్డును తవ్వేసి వదిలిపెట్టడంతో గత 20 రోజులుగా కార్యాలయాలకు వెళ్లే వాహనాలతో పాటు నడకదారిలో వెళ్లాలన్నతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయంపై గ్రామస్తులు కాంట్రాక్టర్(Contractor) రామానాయుడుని నిలదీయగా తాము పనులు చేసేంత వరకేనని అధికారులు అవగాహన లేమితో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఆర్డిఓ కార్యాలయానికి తాహసీల్దార్,మండలపరిషత్, అగ్రికల్చర్, హార్టికల్చర్(Agriculture, Horticulture), హౌసింగ్, జిల్లాకోర్టులతో పాటు దాదాపు 15 కార్యాలయాలకు ఇదే రహదారిలో అధికారులు వెళ్లాల్సి ఉండగా వీటితోపాటు బ్రాహ్మణపల్లి, బ్రాహ్మణపల్లితాండ, ఎనుములపల్లి(Enumulapally), శిల్పారామం కాలనీలకు ఇదే రోడ్డు కుండా కాలినడక నుండి వాహనాలలో ప్రయాణించాల్సి ఉంది అయితే రోడ్డును తవ్వేసి 20 రోజులుగా అలాగే ఉంచారు.
దీంతో సదరు రోడ్లో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్(Contractor)తో పాటు ఆర్ అండ్ బి అధికారులు రోడ్డును బాగు చేసే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విషయంపై ఆర్ అండ్ బి అధికారి జేఈ హోన్నూరుస్వామి ని వివరణ కోరగా తమ పనులలో జాప్యం ఏమీ లేదని కేవలం మున్సిపల్ శాఖ రోడ్లో పైపులైనువేయలని ఉద్దేశంతో ఇంతవరకు పనులు చేయలేదని ఆయన బదులిచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఆర్ అండ్ బి అధికారులు మున్సిపల్ అధికారులు సమన్వయ లోపంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

