కాంగ్రెస్‌ లో చేరిన నేతలు..

వెంగళరావు, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్‌కి చెందిన బీఆర్‌ఎస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ యాదవ్, బీసీ యాదవ సంఘం అధ్యక్షులు ముచ్చర్ల శ్రీశైలం యాదవ్ (Mucharla Srisailam Yadav) లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సొంతంగా ప్రజలకు చేసిన సేవలకు.. ఆకర్షితులై, ఆయన నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ BRS నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.

నవీన్ యాదవ్ (Naveen Yadav) పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజలతో కలిసి పనిచేసే నాయకులను పార్టీ ఎల్లప్పుడూ ఆహ్వానిస్తుందన్నారు. వేణుగోపాల్ యాదవ్ శ్రీశైలం యాదవ్ చేరికతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తామని కొత్తగా చేరిన నాయకులు తెలిపారు.

Leave a Reply