ఉమ్మడి నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి (జీజీహెచ్) లో లాప్రోస్కోపీ యూనిట్ (GGH Laparoscopy Unit) ను సోమవారం పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, డాక్టర్ జి.వి.రావుతో కలిసి రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
కోమటి రెడ్డి (Komatireddy) ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అధునాతన వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి రావడమే లక్ష్యమన్నారు. అందుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ (Prateek Foundation) ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.