Labor Card | కార్మికుల ప్రయోజనం కోసమే లేబర్ కార్డులు….

Labor Card | కార్మికుల ప్రయోజనం కోసమే లేబర్ కార్డులు….

Labor Card | ఊట్కూర్, ఆంధ్రప్రభ : కార్మికులు విధిగా లేబర్ కార్డు(Labor Card) పొంది ఉండాలని లేబర్ కార్డుతోనే కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పగిడిమర్రి సర్పంచ్ ఎండి జాఫర్, ఆశ్రయి స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పగిడిమర్రి జీపీ కార్యాలయం వద్ద ఆశ్రయ స్వచ్ఛంద సంస్థ లేబర్ శాఖ ఆధ్వర్యంలో కార్మికులకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భవన ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు లేబర్ కార్డు తీసుకోవాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల(central and state governments) సంయుక్త ఆధ్వర్యంలో కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లేబర్ కార్డు పొందిన కార్మికులకు ప్రమాద మరణ సహాయం రూ.10, లక్షలు సహజ మరణ సహాయం రూ 2, లక్షలు వైకల్య సహాయం రూ. 5 లక్షలు, పెళ్లి కానుక రూ 30,000 అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోడ రగప్ప, ఆశ్రయ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పవన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply