కర్నూలు బ్యూరో : కర్నూల్ నగరంలోని నాలుగో పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిపై మారణాయుధాలతో దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలకు వెళితే స్థానిక షరీఫ్ నగర్ చెందిన కార్పొరేటర్ జయరాం తండ్రి కాశపోగు సంజన (52) సమీపంలోని భజన మందిరం కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఆయనపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. దాడి ఘటనలో సంజన ముఖం చిత్రమైంది. దీంతో చావు బతుకుల మధ్య ఉన్న ఆయనను సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీసులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంజన పై దాడి చేసిన వ్యక్తి బి.అంజిగా పోలీసులు గుర్తించారు. కాగా సంజన కుమారుడు జయరాం కర్నూల్ నగరంలోని 30 వార్డు కార్పొరేటర్. గతంలో జయరాం వైసిపి పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కిరాయి హంతకుడైన వడ్డే అంజి , అతని కుమారుడు కుమార్ ,శివ ఇంకా కొంతమంది షరీఫ్ నగర్ లోని అలిపిర భజన మందిరం నకు సంజన్న పోయి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో దాడి చేసి గాయపరిచినారు.. పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు..
అయితే అక్కడ చికిత్స పొందు ఆయన మృతి చెందారు.వడ్డే అంజి బైరెడ్డి శబరి గ్రూపు ఫాలోయర్,, కాసేపు సంజన బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ ఫాలోయర్ గా ఉన్నారు.కిరాయి హంతకుడు వడ్డే అంజి కి, కాషాపు సంజనకు గతంలో ఉన్న మనస్పర్ధలు వల్ల దాడి చేసి చంపినట్లు సమాచారం.