KTR | పంట‌లు కొన‌కుండా ఇబ్బందులు

KTR | పంట‌లు కొన‌కుండా ఇబ్బందులు

KTR | ఆందోళ‌న‌లో రైత‌న్న‌లు
రైతు గ‌ణ‌ప‌తిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

KTR | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో రైత‌న్న‌లు నానాకష్టాలు పడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లీ(బీ)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి నాలుగు రోజులుగా మార్కెట్‌ యార్డులో ఉంటున్నా… తన సోయాబీన్ పంటను కొనక‌పోవ‌డంతో అప్పుల బాధతో 3 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పంటను ప్రభుత్వం కొనడం లేదని ఆవేదనతో గణపతి చనిపోయాడ‌ని కేటీఆర్ అన్నారు. ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్య అని వ‌ర్ణించారు.

గణపతి ఓ వీడియోలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. తాను 14 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టుబడితే.. సాగునీరు సరిగా లేక, ఎరువులు సమయానికి దొరకక, పంట దిగుబడి తగ్గిందని.. పండిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే కొనేవాళ్లు లేరని పసిబిడ్డలా వెక్కివెక్కి ఏడ్చిండు.

Leave a Reply