Kruthivennu | దొంగలు బీభత్సం..

Kruthivennu | దొంగలు బీభత్సం..
Kruthivennu | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం జాతీయ రహదారి ప్రక్కన అడ్డపర్ర గ్రామంలో గత రెండు సంవత్సరాల కాలంగా దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. దొంగల బీభత్సం విస్తృతంగా జరుగుతుంది. అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన కరువు అయింది. సోమవారం రాత్రి రామాలయంతో పాటు ఐదు ఇళ్లల్లో దొంగలు పడి కొంత నగదు, బంగారం, వెండి దోచుకున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి డాగ్ స్క్వాడ్లను రప్పించే పనిలో ఉన్నారు. అయితే.. రామాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దొంగ కనిపించినట్లు తెలుస్తోంది. మాస్కు ధరించిన అతని ముఖం స్పష్టంగా కనిపించడంతో స్థానికంగా ఉన్న కొంత మంది వ్యక్తులే ఈ దోపిడీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

