Kotagiri | నామినేషన్ కేంద్రాల పరిశీలన

Kotagiri | నామినేషన్ కేంద్రాల పరిశీలన
ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు డీఎల్పీఓ సూచనలు
Kotagiri | కోటగిరి, ఆంధ్రప్రభ : పోతంగల్ (Pothangal) మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు (Nagaraju) శుక్రవారం పరిశీలించారు. మండలంలోని కోడిచర్ల, కొల్లూర్ పొతంగల్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వివరించారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను రికార్డులో నమోదు చేయాలని సూచించారు. డీఎల్పీఓ వెంట ఎంపీడీవో చందర్ ఉన్నారు.
