ఘనంగా కొలనుపాక హైస్కూల్ వార్షికోత్సవం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక పీఎంశ్రీ జడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎర్ర లక్ష్మి మాట్లాడుతూ.. నిరంతరం కష్టపడే తత్వం విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. హై స్కూల్ కు చెందిన పదవ తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ, ఏఏపిసి చైర్మన్ పి పద్మ, ఉప సర్పంచ్ గొట్టం విజయేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.

Leave a Reply