ఖైరతాబాద్ గణేశుడి సన్నిధిలో మహిళ ప్రసవం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఖైరతాబాద్​ మహాగణపతి (Mahaganapati of Khairatabad) దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. వర్షం(rain)లోనూ భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి(Sri Vishwashanthi Mahashakti Ganapati)గా ఖైరతాబాద్​ గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. అయితే బ‌డా గ‌ణేషుడి దర్శనానికి వచ్చిన ఓ మహిళ క్యూలైన్​లో ప్రసవించింది. పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​(Community Health Centre)లో మహిళకు వైద్యం అందించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహిళ రాజస్థాన్​(Rajasthan)కు చెందిన రేష్మగా గుర్తించారు. ఆ బిడ్డను వినాయకుడు ఇచ్చిన ప్రసాదంగా ఆమె స్వీకరిస్తానని చెప్పింది.

Leave a Reply