Karimabad | ఘనంగా వాజ్ పేయి జయంతి వేడుకలు

Karimabad | ఘనంగా వాజ్ పేయి జయంతి వేడుకలు
- వాజ్ పేయ్ దూరదృష్టితో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది
- అణు పరీక్షల ద్వారా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటారు
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్
Karimabad | కరిమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ తూర్పు నియోజకవర్గం శివనగర్ మండలం 35వ డివిజన్ పరిధిలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహారీ వాజపేయ్101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ అటల్ బిహారి వాజ్ పేయి జయంతి సందర్బంగా శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ అధ్యక్షతన 35వ డివిజన్ సీనియర్ నాయకులు జన్ను ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పాల్గొని వాజ్ పేయ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్ దేశ చరిత్రలో నిలిచిపోయిన గొప్ప మహనీయుడన్నారు. దేశ ప్రధానిగా వాజ్ పేయ్ దూరదృష్టి వల్లే నేడు దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందన్నారు. భారత జాతికి శాంతిమంత్రం జపించడమే కాదు, యుద్ధతంత్రం తెలుసునని నిరూపించిన నాయకుడన్నారు. దేశానికి సుపరిపాలనను పరిచయం చేసిన పరిపాలనాధక్షుడు వాజ్ పేయ్ అని, తన జీవితాన్ని భారతమాత సేవకై అంకితమిచ్చిన గొప్ప దేశ భక్తుడన్నారు. భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జయంతి సంధర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా శాఖ పక్షాన ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రచార కార్యదర్శి బైరి శ్యామ్, వరంగల్ జిల్లా స్పోక్స్ పర్సన్ ఆడెపు వెంకటేష్, ఓబీసీ అధ్యక్షులు కందిమల్ల మహేష్, జిల్లా ఎస్ సి మోర్చా ఉపాధ్యక్షులు నవీన్, శివనగర్ మండల జనరల్ సెక్రెటరీ వైట్ల గణేష్, సూర శ్రీనివాస్, కాంటెస్ట్ అభ్యర్థి ఇనుముల అజయ్, మండల ఉపాధ్యక్షులు పిట్టల వెంకన్న, దుస్సా శ్రీధర్, మండల కార్యదర్శి చామకూరి నవీన్, కందుకూరి విజయ్ బండి నాగేష్, బండి సుజాత తదితరులు పాల్గొన్నారు.
