Kareemabaad | చాదర్ సమర్పించిన మాజీ ఎమ్మెల్యే నరేందర్

Kareemabaad | చాదర్ సమర్పించిన మాజీ ఎమ్మెల్యే నరేందర్

Kareemabaad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ తూర్పు మైనారిటీ నాయకులు బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి, మాజీ ఎమ్మెల్యే నరేందర్స్వ గృహం నుంచి ఊరేగింపుగా బయలుదేరి కరీమాబాద్ లోని హజరత్ మాషుక్ రబ్బానీ ఉర్సు దర్గాలో చాదర్‌, కానుకలు సమర్పించారు. ఈసందర్భంగా పీఠాధిపతులను, మైనారిటీ మత పెద్దలను నరేందర్ శాలువాతో సత్కరించారు. అనంతరం మత పెద్దలు నన్నపునేని నరేందర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ పెద్దలు, మైనారిటీ సోదరులు, టీఆర్ఎస్ పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గం ముఖ్య నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply