అమ్మవారికి బంగారు డైమండ్ సూత్రాల విరాళం..

అమ్మవారికి బంగారు డైమండ్ సూత్రాల విరాళం..
22 గ్రాముల బంగారు ఆభరణం సమర్పణ
రూ 4 లక్షల విలువైన బంగారు సూత్రాలు అందించిన భక్తుడు.
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారికి బెంజ్ సర్కిల్ నివాసి జి. శరత్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి బంగారు డైమండ్ సూత్రాలను విరాళంగా సమర్పించారు. సుమారు 22 గ్రాముల బరువున్న ఈ ఆభరణం విలువ దాదాపు రూ 4 లక్షలుగా అంచనా వేయబడింది.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీను కలిసి బంగారు ఆభరణాలను అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచన అనంతరం చైర్మన్ బొర్రా గాంధీ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.
