నవీన్ యాదవ్ కు కమ్మ సామాజిక వర్గం మద్దతు

నవీన్ యాదవ్ కు కమ్మ సామాజిక వర్గం మద్దతు

యూసఫ్ గూడా, ఆంధ్రప్రభ : యూసుఫ్ గూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తెలంగాణ కమ్మ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈసంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమైక్య అధ్యక్షులు బొడ్డు రవి శంకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో 60 కమ్మ సంఘాలు ఉన్నాయన్నారు.

కమ్మ సామాజిక వర్గాల నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) కు మద్దతు తెలుపుతున్నామన్నారు. నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి.. చాలా సంవత్సరాలుగా పేదలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 40వేల కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసిందన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి నవీన్ యాదవ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Leave a Reply