Kalvakurthi MLA | బీటీ రోడ్డు పనులు పునః ప్రారంభం

Kalvakurthi MLA | బీటీ రోడ్డు పనులు పునః ప్రారంభం
Kalvakurthi MLA | వెల్దండ, ఆంధ్రప్రభ : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కొట్రగేట్ చౌరస్తా నుంచి తిమ్మినోనిపల్లి వరకు 2 కిలోమీటర్ల మేర గతంలో మంజూరైన బీటీ రోడ్డు పనులని తిరిగి బుధవారం పునఃప్రారంభించినట్టు గ్రామస్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే నిలిచి పోయిన బీటీ రోడ్డు పనులను తిరిగి పునఃప్రారంభించినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు హరికిషన్ నాయక్, మాజీ ఉపసర్పంచ్ చిన్న, గ్రామ మాజీ వార్డ్ మెంబర్లు, వార్డు మెంబర్స్ సోనా కిషన్ నాయక్ , రవీందర్ నాయక్, మౌనిక, రమేష్ నాయక్, సిరిగిరి లక్ష్మమ్మ, శివరాజ్, చీమల ప్రశాంతరెడ్డి,శేఖర్ రెడ్డి,కడమంచి శ్రీశైలం,శొంఠి హర్ష వర్ధన్ గౌడ్, గుమ్మకొండ నర్సింహ్మ, పిల్లి రాములు, చాకలి బందిగయ్య,రమాకాంత్ రెడ్డి,యాది రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరుణ, పాల్గొన్నారు.
