kalvakuntla kavitha | బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్..

kalvakuntla kavitha | బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్..
kalvakuntla kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తాజా ఎన్నికలు తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ఓ ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ముందుందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి , హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ లతో కలిసి మాట్లాడుతూ… మరోవైపు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 16 మున్సిపాలిటీలను మాత్రమే గెలుచుకో గలిగిందన్నారు. ఒక కార్పొరేషన్ లోనూ ప్రభావం చూపలేకపోయిందన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేసి అద్భుతమైన ప్రతిభ కనబరిచామన్నారు. తాము రాజకీయ పార్టీగా మారబోతున్నామని ప్రకటించిన తక్కువ సమయంలోనే ప్రజలు మమ్మల్ని ఆదరించారని కవిత చెప్పుకొచ్చారు. జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన మున్సిపల్ ఎన్నికల్లో 40మంది విజయం సాధించారన్నారు. ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమకు స్పష్టమైన మెజార్టీ లభించిందని ఆమె వెల్లడించారు.
అధికారికంగా 33స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ , మరో 7 చోట్ల బీఫామ్ సాంకేతిక కారణాల వల్ల స్వతంత్రులుగా గెలిచింది కూడా తమ అభ్యర్థులేనని కవిత తేల్చి చెప్పారు. గతంలో 90శాతం మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 16 స్థానాలకే పరిమితమైందని కవిత అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు.

కాంగ్రెస్ అపొజిషన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ పోల్చుకుంటుందన్న కవిత ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో బీఆర్ఎస్ సమీక్షించుకోవాలని సూచించారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు పరోక్షంగా సహకరించారని, ఇది ఆ రెండు పార్టీల పొత్తుకు తొలిమెట్టు అని కవిత ఆరోపించారు. కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తోంది. కాంగ్రెస్ తో మిలాఖత్ అయిన సీపీఐ కి మద్దతివ్వటమంటే నయవంచనే అని కవిత ఆరోపించారు. కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తోంది. కాంగ్రెస్ తో మిలాఖత్ అయిన సీపీఐ కి మద్దతివ్వటమంటే నయవంచనే అని కవిత ఆరోపించారు.
CLICK HERE TO READ అక్కకొండ లక్ష్మీ నరసింహుడికి నిత్యం పూజలు..
