కడెం ప్రాజెక్టు ఆయకట్టు కాలువలకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
కడెం, జులై 15, ఆంధ్రప్రభ : కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ (Narayana Reddy Project) ఆయకట్టు పరిధిలో గల రైతులు (Farmers) కడెం ప్రాజెక్టు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని వృధా చేయకూడదని ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడమ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కడెం ప్రాజెక్టు నీటిని నీటిపారుదల శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయకట్టు పంటలకు సాగునీరు సరఫరా చేసే ప్రధాన కాలువ ఎడమ కాలువకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని మొదటిసారిగా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ లో సాగునీరు రావడం మనందరి అదృష్టం అన్నారు.
రాష్ట్రం లోనే తొలిసారిగా కడెం ప్రాజెక్టు నీటిని ఆయకట్టు రైతుల ఖరీఫ్ పంటల సాగుకు నేటి విడుదల చేయడం జరిగిందన్నారు. కడెం ప్రాజెక్టు అభివృద్ధికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడెం ప్రాజెక్టు వరదగేట్ల మరమ్మతులు అభివృద్ధి పనులు విద్యుత్ సౌకర్యం కోసం 9 కోట్ల 46 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఎలాంటి డోకా లేదన్నారు. రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించే అవకాశం కలిగిందన్నారు. కడెం ప్రాజెక్టు అభివృద్ధి కోసం కడెం జలాశయంలో పేరుకుపోయిన శిల్ట్ తీయడానికి పైలెట్ ప్రాజెక్టుగా కడెం ప్రాజెక్టును ప్రభుత్వం ఎంపిక చేసిందని రెండు పంటల సాగు అయిన తర్వాత జలాశయంలో సిల్ట్ తీసే ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.
అంతకుముందు ప్రాజెక్టు సమీపంలో గల మైసమ్మ తల్లి ఆలయంలోకి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వెళ్లి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాజెక్టు వద్ద మొక్కలను ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ రవీందర్, కడెం ప్రాజెక్ట్ ఈఈ రాథోడ్ విట్టల్, కడెం ఎంపీడీఓ అరుణ, ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగల భూమన్న భూషణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పి సతీష్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బి.రమేష్ వర్మ, యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రేంకల శ్రీనివాస్ యాదవ్, దస్తురాబాద్ మాజీ ఎంపీపీ సింగర్ కిషన్, మండల నాయకులు జొన్నల చంద్రశేఖర్ గుప్తా, వాజిద్ ఖాన్, ఆకుల లచ్చన్న, టి శంకర్ యమ్ ఏ రహీం తొట్ల ధర్మయ్య, కే లక్ష్మణ్, తొట్ల గంగాధర్ రాజు, జన్నారం మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.