విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అమోఘం…

విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అమోఘం…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే విద్యాభివృద్ధికి చేసిన కృషి అమోఘమైందని ఊట్కూర్ మండల అంబేడ్కర్ సంఘంఅధ్యక్షులుకొక్కుశంకర్, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ జోగిని వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ హాజమ్మ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి పుదరాజ్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలకు ప్రేరణ సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని రచయిత్రిగా నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణిఅని కొనియాడారు.ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించికుల వ్యవస్థకు, వ్యతిరేకంగా మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం చేసి తమ సామాజిక బాధ్యతగా నిలిచారనికొనియాడారు.

ఈ కార్యక్రమంలోఅంబేద్కర్ సంఘం కార్యదర్శి కొండన్ భరత్ సామాజిక కార్యకర్త నారాయణ, నరసింహులు గారు వార్డ్ మెంబర్స్ వార్డు సభ్యులు మల్లేష్ ,రూప లక్ష్మణ్,నరేష్ ఆయా సంఘాల నాయకులు చిన్న తిమ్మప్ప సహదేవ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply