jump2other | పార్టీల మార్పుల చుట్టూ రాజకీయాలు..మారుతున్న సమీకరణలు

jump2other | పార్టీల మార్పుల చుట్టూ రాజకీయాలు..మారుతున్న సమీకరణలు

jump2other | కేడర్ స్థాయిలో కదలికలు.. పెరుగుతున్న ఊహాగానాలు
జనసేన, బీజేపీ వ్యూహాలు.. కొత్త నేతల ఆకర్షణ
పార్టీల్లో అంతర్గత కలహాలు.. సమీకరణల మార్పు

jump2other | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏపీ రాజకీయాల్లో ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నప్పటికీ, నాయకుల కదలికలు మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికలే లక్ష్యంగా ఉంటున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నేతల పార్టీ మార్పుల ఊహాగానాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి.

అధికార తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీల మధ్య కేడర్ స్థాయిలో కదలికలు కనిపిస్తున్నాయి.

రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో వైసీపీకి చెందిన కొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మార్పులపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.

పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జన సేన పార్టీ కూడా యువ నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో టిడిపి, వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

jump2other
jump2other

ఇక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యూనిట్, దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో తన బేస్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తూ, ఇతర పార్టీల అసంతృప్త నేతలను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చేరికలు ఎక్కువగా స్థానిక స్థాయిలోనే పరిమితమవుతున్నాయి.

ఈ రాజకీయ కదలికలతో పాటు పార్టీల్లో అంతర్గత అసంతృప్తి కూడా బయటపడుతోంది. టికెట్ ఆశలు, స్థానిక ఆధిపత్య పోటీలు, అంతర్గత కలహాలు, పాతవారిని కాదని పార్టీల్లో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు కొన్ని చోట్ల తీవ్ర విభేదాలకు దారి తీస్తున్నాయి.

అయితే పార్టీ అధిష్ఠానాలు మాత్రం ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ బ్యాలన్స్ చేసుకుంటున్నాయి. ఒకవైపు బలమైన నేతలను ఆకర్షించడంపై దృష్టి పెట్టుతూనే, మరోవైపు పాత కేడర్‌లో అసంతృప్తి పెరగకుండా సమన్వయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఏపీలో పార్టీ మార్పులు ఎక్కువగా ఊహాగానాల దశలోనే ఉన్నప్పటికీ, ఇవి రాబోయే రోజుల్లో కార్యరూపం దాల్చే అవకాశం ఉండే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు స్పష్టతకు వస్తే మాత్రం, ఏపీ రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply