క్యాతన్‌పల్లిలో బీజేపీలోకి చేరికలు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కల రమేష్ ఆధ్వర్యంలో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ 7వ వార్డుకు చెందిన రాజండి లావణ్య, శ్రీనివాస్ శనివారం బీజేపీలో చేరారు.

వీరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, బీజేపీ విధివిధానాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్యాతన్‌పల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు దన్‌సింగ్, నాయకులు కట్ట ఈశ్వరచారి, వైద్య శ్రీనివాస్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply